రసాయన శాస్త్రంలో ఆవిష్కరణలు రావాలి


Tue,March 19, 2019 11:35 PM

సిద్దిపేట రూరల్ : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్)లో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యం లో టెక్నలాజికల్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ సైన్సెస్ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మొదటి సెషన్‌కి ఎన్‌ఐటీ (వరంగల్) ప్రొఫెసర్ డా.బి.శ్రీనివాస్ గౌరవ అతిథిగా హాజరై మా ట్లాడారు. రసాయన శాస్త్రంతో నూతన ఆవిష్కరణలు రావాలని పిలుపునిచ్చారు. అధునిక కాలంలో రసాయన అంశాలకు చాలా ప్రాధాన్యత పెరుగడంతో రసాయన శాస్త్రవేత్తలపై బాధ్యత మరింత పెరిగిందని తెలి పారు. గ్రీన్ కెమిస్ట్రీ అనే అంశంపై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఔషధ తయారీలో తక్కువ వాతావరణ కాలుష్యం, వ్యాధిగ్రస్తులకు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, తక్కువ మోతాదు రసాయనాలతో మిశ్రమా లను ఉపయోగిస్తూ గ్రీన్ కెమికల్ ఔషధాల తయారీ విధానాన్ని వివరించారు. ఇప్పటికే 20కి పైగా ఔషధా లు తయారు చేశానన్నారు. గ్రీన్ కెమిస్ట్రీ అంశంపై 35 అంతర్జాతీయ పరిశోధన పత్రాలు ప్రచురించినట్లు తెలిపారు. ప్రొ.బి.చంద్రమౌళి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్ర భుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ రావడం అభినందనీయమని, ఇలాంటి సెమినార్ల ద్వారా రసాయన శాస్త్ర పరిశోధనల్లో వినూత్నమైన మార్పులు తెలుసుకొని యువ శాస్త్రవేత్తలుగా రాణించాలని సూచించారు. 2వ సెషన్‌లో ప్రధాన వక్తగా డా.ఎం.సత్యనారాయణ డ్రగ్ డిస్కవరీ అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు.

మొదటగా ఔ షధ నమూనా డిజైన్ చేసే విధానం వివరిస్తూ ఔషధాల వాడకంతో వ్యాధిగ్రస్తుల శరీరాల్లో రసాయనిక చర్య వల్ల కలిగే దు ష్ఫలితాలను తగ్గించడా నికి డ్రగ్ మాలిక్యూడ్‌ను డిజైన్ చేశానని తెలిపారు. డా.బి.శిరీష మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులు సా మాజిక మాధ్యమాల ద్వారా రసాయనికతకు సంబంధించిన టెక్నాలజీ అంశాలపై దృష్టి పెడితే భవిష్యత్ పరిశోధనలో ముందంజలో ఉండవచ్చని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సీహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. లక్ష్యాన్ని ఏర్పా టు చేసుకొని ఆ దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పరి శోధన సదస్సులు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో డా.మంజునాథ్, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పరిశోధన విద్యార్థులు, సెమినార్ కోఆర్డినేటర్ సలీమ్ పాషా, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...