గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం


Mon,March 18, 2019 11:16 PM

-నర్సాయపల్లి అభివృద్ధిలోకృష్ణారెడ్డి సేవలు ఎనలేనివి
-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
మద్దూరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నర్సాయపల్లిలో బద్దిపడిగె నర్సమ్మ, నర్సింహరెడ్డిల స్మారకార్థం వారి మనుమడైన కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ బద్దిపడిగె కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బద్దిపడిగె లలిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ జ్యోతి కార్యక్రమం ద్వారా ప్రణాళికలను రూపొందిస్తుందన్నారు. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములై ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. నర్సాయపల్లిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న బద్దిపడిగె కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద మాధవి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్, ఎంపీటీసీ దేవరాజుల కనకలక్ష్మి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రమైన నీటినే తాగాలి
కొమురవెల్లి : పరిశుభ్రమైన నీళ్లు తాగితే రోగాలు దరిచేరవని ఎస్‌ఐ కుకునూరి సతీశ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని రసూలాబాద్‌లో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్‌తో కలిసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ.. శుద్ధిచేసిన నీళ్లను తాగడం వల్ల రోగాలు దరిచేరవన్నారు. అదే విధంగా ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల జరిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. అనంతరం వేసవికాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో సర్పంచ్ స్వామిగౌడ్, వార్డు సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నెబోయిన సురేశ్, వార్డు సభ్యులు రాములు, శ్రవణ్, రజిత, భవాని, సునిత, చింతల కనకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...