అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు


Mon,March 18, 2019 11:16 PM

-లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీయే లక్ష్యం
-సీఎం కేసీఆర్ ఢిల్లీలో అడుగు పెట్టాలి
-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి\
మద్దూరు : తెలంగాణకు రావాల్సిన నిధులను రాబట్టి రాష్ట్ర ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు దేశానికి ఒక గొప్ప నాయకత్వాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రజల పక్షాన సీ ఎం కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెట్టాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తిని చేస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మద్దూరు, కమలాయపల్లి గ్రామాల సర్పంచ్‌లు కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, ఓరుగంటి అంజయ్యలతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బం గారు తెలంగాణ నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సిందేనన్నారు. దేశంలోని జలవనరులను వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనట్లు విమర్శించారు. రా బోయే లోకసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లలో విజయం సాధించనుందన్నారు.

నియోజకవర్గం పక్షాన లోకసభ ఎన్నికల్లో 50వేల మెజార్టీని సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందివ్వనున్నట్లు తెలిపారు. రా ష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్‌ల దాకా అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఈ ఐదేండ్ల వ్యవధిలో నియోజకవర్గంలోని చెరువులన్నింటిని నింపిన తర్వాతే ప్రజలను మళ్లీ ఓటు అడుగనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగు నీరందించడంలో విఫలమైన పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుతం పనికిరాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద మాధవి, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ బద్దిపడిగె కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్‌కుమార్, వైస్ ఎంపీపీ చల్లా లక్ష్మీనర్సింహరెడ్డి, మండల కార్యదర్శి నల్ల బాల్‌రెడ్డి, సీనియర్ నాయకుడు బండి చంద్రయ్య, యూత్ మండల అధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామెర మల్లేశం, సొసైటీ డైరెక్టర్ రాచకొండ ఉప్పలయ్య, మాజీ సర్పంచ్ ముక్తార్ అహ్మద్, ఉపసర్పంచ్ ఆరీఫ్, నాయకులు నీల బాలకృష్ణ, బోయిని మనోహర్, క్షీరసాగర్ విజయ్, కాటం బాలయ్య, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...