కొనసాగుతున్న పది పరీక్షలు


Mon,March 18, 2019 11:15 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలోని దుబ్బాక టౌన్, మిరుదొడ్డి, రాయపోల్, తొగుట మండలాల్లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్దకు సకాలంలో విద్యార్థులు చేరుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2707 మంది విద్యార్థులకు గాను సోమవారం తెలుగు-2పరీక్షకు 2703 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దుబ్బాకలో 5 పరీక్ష కేంద్రాలలో 997 మంది విద్యార్థులకు 995 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లచ్చపేట, పోతారెడ్డిపేట కేంద్రాలలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మిరుదొడ్డి మండలంలో 2 పరీక్ష కేంద్రాలలో 458 మంది విద్యార్థులకు గాను 457 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రాయపోల్ మండలంలో రెండు పరీక్షా కేంద్రాలలో 459 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దౌల్తాబాద్ మండలంలో 338 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తొగుట మండలంలో రెండు పరీక్ష కేంద్రాలకు గాను 454 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో శతశాతంతో గత రెండు పరీక్షలకు విద్యార్థులు పరీక్షకు హాజరు కావటం గమనార్హం. దుబ్బాక మండలంలో లచ్చపేట మోడల్‌స్కూల్, లచ్చపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌లో సెక్షన్-ఎ, సెక్షన్-బి, దుబ్బాక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను ఇన్‌చార్జి ఎంఈవో ప్రభుదాస్ సందర్శించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...