స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం


Mon,March 18, 2019 11:15 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి సర్పంచ్ సద్ది రాజిరెడ్డి తెలిపారు. పెద్దగుండవెళ్లిలో సోమవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు , యువజన సంఘాల వారు పాల్గొని గ్రామంలో మురికి కాల్వలు శుభ్రం చేసి, దోమల నివారణ మందులను చల్లారు. పిచ్చి మొక్కలను తొలగించటంతో పాటు చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తేనే సంపూర్ణ స్వచ్ఛత గ్రామంగా ఏర్పడుతుందన్నారు. గ్రామాన్ని స్వచ్ఛతతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి పరచుకునేందుకు సమిష్ఠిగా కృషి చేద్దామని తెలిపారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు యువజన, మహిళా సంఘాల వారిని భాగస్వాములు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌లో పోతారెడ్డిపేట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...