మెదక్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం


Mon,March 18, 2019 11:15 PM

వర్గల్ : పార్లమెంటరీ ఎన్నికల్లో మెదక్ స్థానాన్ని, అలాగే 4 ఉమ్మడి జి ల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, టూరిజం కార్పొరేషన్ పన్యా ల భూపతిరెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రతాప్‌రెడ్డిలు అన్నారు. సోమవారం వర్గల్ మండలంలోని గౌరారంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పన్యాల భూపతిరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిలు హాజరై కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే దేశంలో కూడా కేసీఆర్ పాలన సాధ్యమన్నారు. 16 మంది ఎంపీలతో రాష్ర్టాభివృద్ధి అవసరమైన వసతులు, నిధులను సమకూర్చుకోవచ్చన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థికి గెలుపు కోసం పూర్తిస్థాయిలో కృషి చేయాలన్నారు. అలాగే, శుక్రవారం జరుగునున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పాతూరి సుధాకర్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌లను మొదటి ప్రాధాన్యత ఓటేసి, గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...