నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి


Sun,March 17, 2019 10:42 PM

సంగారెడ్డి టౌన్ :నేటి నుంచి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జహీరాబాద్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఆదివారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయని తెలిపారు.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరణ..
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్లు సెట్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయు సమయంలో అభ్యర్థికి సంబంధించి కలెక్టరేట్‌లోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని, అభ్యర్థి వెంట కేవలం నలుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

మధ్యాహ్నం 3.00 గంటల వరకే అవకాశం..
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు వరకు మాత్రమే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 3.00 గంటల లోపు రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి వచ్చిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉందని, 3గంటల తరువాత వచ్చిన అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు అనుమతించడం జరుగదన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి ఇతరులను అనుమతించేది లేదన్నారు.

సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవు..
నెగోషియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. 21వ తేదీన హోలి, 23న నాల్గొ శనివారం, 24న ఆదివారం సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. అభ్యర్థులు సెలవు రోజుల్లో నామినేషన్ వేసేందుకు రాకూడదని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌వో కార్యాలయంలోనే నామినేషన్లు దాఖలు చేయాలన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...