మల్లన్న భక్తుల కోసం పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు


Sun,March 17, 2019 10:41 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జునస్వా మి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ ఎస్. మహేందర్ అన్నారు. 9వ ఆదివారాన్ని పురస్కరించుకొని చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి, మద్దూరు ఎస్‌ఐలు సతీశ్‌కుమార్, రాజిరెడితో కలిసి ఏసీపీ మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఏసీపీ పర్యవేక్షించారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు, శీఘ్రదర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలు, ఆలయ ఆవరణను ఆయన పరిశీలించారు. ఆలయ, పోలీస్ అధికారులు, సిబ్బందికి కమ్యూనికేషన్ ద్వారా బందోబస్తుపై ఏసీపీ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 9వ ఆదివారం సందర్భంగా జాతరలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసుల సలహాలు, సూచనలను పాటించి త్వరగా స్వామివారిని దర్శించుకోవాలన్నారు. స్వామివారి క్షేత్రంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, జాతరలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అధునాతన ట్యాప్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్‌ను తీస్తున్నట్లు తెలిపారు. దీంతో వారు గతంలో ఎక్కడైనా నేరాలు చేస్తే దానికి సంభందించిన వివరాలు వెంటనే తెలిసిపోతుందన్నారు. జేబుదొంగతనాలు వంటివి జరుగకుండా ముందోస్తు నివారణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రతి ఆదివారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మల్లన్న క్షేత్రంలో పోలీస్ బందోబస్తును దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఏసీపీ మహేందర్‌ను భక్తులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...