పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు : ఏసీపీ మహేందర్


Sun,March 17, 2019 10:41 PM

కొమురవెల్లి : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని ఏసీపీ మహేందర్ అన్నారు. మండలంలోని లెనిన్‌నగర్‌లో వార్డు సభ్యుడు రాకెం బాబు తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన చెత్త బుట్టలను ఏసీపీ మహేందర్ సర్పంచ్ సనాది సబితతో కలిసి మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని అలాంటి పల్లెలను ప్రగతి పథంలో తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. జిలాల్లో చిన్న గ్రామపంచాయతీ అయిన లెనిన్‌నగర్‌ను ప్రజలందరి భాగస్వామ్వంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామంలో ఎవరు రోడ్డుపై చెత్త వేయొద్దని, తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ గ్రామమే లక్ష్యంగా తన సొంత ఖర్చులతో చెత్త బుట్టలను అందించిన వార్డు సభ్యుడు రాకెం బాబును ఏసీపీ అభినందించారు. గ్రామంలోని యువకులు చెడు అలవాట్లకు గురికాకుండా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో రాణించాలన్నారు. ఇటీవల గ్రామం నుంచి ఆర్మీలో ఉద్యోగం సాధించిన రవితేజ అతని తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సతీశ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎం డీ.రఫీ ఉపసర్పంచ్ దాసరి శ్రీనివాస్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...