పరిశుభ్రతపై అవగాహన


Sun,March 17, 2019 10:41 PM

కొమురవెల్లి : పోషణా పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని ఐనాపూర్‌లో ఆదివారం అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. పరిశుభ్రతతో రోగాలు దరి చేరవని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భోజనం ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, చేతులు కడిగే విధానాన్ని చూపించారు. అనంతరం గ్రామవీధుల్లో శ్రమదానం నిర్వహించి చెత్తాచెదారాన్ని తొలిగించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు రమణారెడ్డి అంగన్‌వాడీ టీచర్లు మంజుల, అరుణ, పుష్పలత, వార్డు సభ్యులు ఎండీ.అప్జల్, రుక్మిణి, ఆశ కర్యకర్తలు సంధ్యారాణి, నిర్మల, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు తదితరులు ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...