తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు


Sun,March 17, 2019 10:40 PM

కొమురవెల్లి : తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మర్రిముచ్చాలలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బూర్గు సత్తయ్య రోజు మాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లుగీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి పడి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సత్తయ్యను వెంటనే తోటి గీత కార్మికులు సిద్దిపేటలోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. కాగా, ప్రమాదంలో ఎడమకాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలైన సత్తయ్యగౌడ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ బొడిగం పద్మ, గౌడ సంఘం మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణాగౌడ్ కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...