సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి


Sat,March 16, 2019 11:43 PM

మద్దూరు : గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు సహకరించాలని చేర్యాల సీఐ లేతాకుల రఘు అన్నారు. మండలంలోని రేబర్తిలోని అరుణోదయ, శుభోదయ మహిళా సంఘాల సభ్యులు శనివారం గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకోసం రూ.40వేల నగదును సీఐ రఘు కు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మా ట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని తెలిపారు. ఒక్కో సీసీ కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పాడి రాజిరెడ్డి, సర్పంచ్ నాంపల్లి సవిత, ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళి, మాజీ సర్పంచ్ అందె భూపతి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...