సజావుగా పదో తరగతి పరీక్షలు


Sat,March 16, 2019 11:43 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పదో తరగతి పరీక్షలు శని వారం మొదటిరోజు సజావుగా సాగడంతోపాటు ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు పరీక్ష రాశారు. చేర్యాల, కొ మురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన 1426 మంది విద్యార్థులు మొదటి రోజు తెలుగు పరీక్షకు హాజరైనట్లు, చేర్యాల బాలికల పాఠశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని చేర్యాల, కొమురవెల్లి మండలాల ఎంఈవో జి.రాములు, మద్దూరు ఎంఈవో నర్సింహారెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగేందుకు మండలాల్లో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. చేర్యాల మండలంలో 4 పరీక్ష కేంద్రాలు, కొమురవెల్లిలో 1 పరీక్ష కేంద్రం, మద్దూరు మండలంలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ ఆద ర్శ పాఠశాల కేంద్రంలో 208, పట్టణంలోని సాంఘిక సం క్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో 260, బాలురు ఉన్న త పాఠశాల కేంద్రంలో 174, బాలికల ఉన్నత పాఠశాలలో 243, కొమురవెల్లి ఉన్నత పాఠశాలలో కేంద్రంలో 139 మంది విద్యార్థులు, మద్దూరులో 259, దూళ్మిట్టలో 143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైయ్యారు. ఆయా కేంద్రా ల వద్ద పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...