మహిళలు పోషకాహారం తీసుకోవాలి


Sat,March 16, 2019 11:43 PM

కొమురవెల్లి : ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించడంతో పాటు పోషక ఆహారం తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్ భారతి అన్నారు. శనివారం మండలంలోని రసూలాబాద్‌లో అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ భారతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పిల్లలకు చేతులు శుభ్రంగా కడిగే విధానాన్ని చూపించారు. కార్యక్రమంలో సర్పంచ్ పచ్చిమండ్ల స్వామిగౌడ్ పాల్గొన్నారు.
పోసాన్‌పల్లిలో సీమంతం..
పోషణా పక్షోత్సవాల్లో భాగం గా పోసాన్‌పల్లిలో పలువురు గ ర్భిణులకు సీమంతం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. గర్భిణులు పోషకాహా రం తీసుకోవాలన్నారు. అదేవిధంగా పిల్లలకు సమతుల ఆహా రం అందేవిధంగా తల్లులు శ్రద్ధ తీసుకోవడంతో పాటు మంచి ప్రవర్తన, పరిశుభ్రత పాటించే విధంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ బూర్గు కొండమ్మ, ఏఎన్‌ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయురాలు శోభారాణి, ఆశ కార్యకర్త సంతోశ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...