మెదక్ ఎంపీ స్థానంలో భారీ మెజార్టీ సాధిస్తాం..


Sat,March 16, 2019 11:43 PM

-పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి
-టీఆర్‌ఎస్ మనోహరాబాద్ మండల కార్యకర్తలతో సన్నాహక సమావేశం
తూప్రాన్, నమస్తేతెలంగాణ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థికి రికార్డు మెజార్టీ సాధించి పెడుతామని పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి పేర్కొ న్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేడు దేశాన్ని ఆకట్టుకుంటున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎటువంటి ఫలితాలు అందించారో.. ఆ రికార్డులను అధిగమించేలా ఎంపీ ఎన్నికల్లో గ్రామాల వారీగా మెజార్టీలు సాధించి ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఢిల్లీలో టీఆర్‌ఎస్ సత్తాను మరోసారి చూ పాలని కార్యకర్తలను కోరారు. మనోహరాబాద్ మండల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే టీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మెజార్టీ గత రికార్డులను బద్దలు కొట్టాలన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం రానున్న కాలంలో బంగారు తెలంగాణగా అభివృద్ధి పథం లో ముందుకు సాగుతుందని చెప్పారు. మెదక్ జిల్లాతో పాటు ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవరాన్ని ఆదర్శంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రానున్న ఐదు సంవత్సరాల్లో మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వెల్లడించినట్లు వివరించారు. దేశానికే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దిక్సూచిగా మారాయన్నారు.

తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ర్టాల ప్ర భుత్వాలు అమలు చేసేందుకు పోటీ పడుతున్నాయని వివ రించారు. దేశంలో నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు నిరంతరంగా సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృ ష్టించిందన్నారు.
సమావేశంలో ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, హౌ సింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, రాష్ట్ర నేతలు వంటేరు ప్రతాపరెడ్డి, యాదవరెడ్డి, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పెంటాగౌడ్, నాగభూషనం, బుల్లెట్ రాజు, నేతలు చంద్రశేఖర్, పురం రవీందర్, బాలకృష్ణారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్‌గౌడ్, తప్పెట శ్రీనివాస్, రమేశ్‌గౌడ్, నరేందర్, భిక్షపతి, జా వెద్, శ్రీహరిగౌడ్, నరాల పెంటయ్య, కొండాపూర్ నర్సింగ్‌రావు పాల్గొన్నారు. అనంతరం మండల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీ సాధించడానికి అవసరమైన ప్రణాళికను సమన్వ య కమిటీ సభ్యులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...