రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ


Sat,March 16, 2019 11:42 PM

-18 నుంచి 25 వరకు పార్లమెంట్ అభ్యర్థులఎన్నికల నామినేషన్ల స్వీకరణ
-11 నుంచి 3 గంటల వరకు సమయం
-అభ్యర్థితోపాటు నలుగురు వ్యక్తులు..
-మూడు వాహనాలకు మాత్రమే అనుమతి
-మెదక్ జిల్లా ఎస్పీ చందనదీప్తి
మెదక్ మున్సిపాలిటీ : ఈ నెల 18 నుంచి 25 వరకు పార్లమెంటు ఎన్నికల నామినేషన్ దాఖలు ఉన్నందునా అన్ని చర్యలు భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చందనదీప్తి తెలిపారు. శనివారం ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ.. 2019 మెదక్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ వేసే అభ్యర్థులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయాలని సూచించారు. అంతేకాకుండా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి వెంట కేవలం నలుగురు వ్యక్తులు, 3 వాహనాలు మాత్ర మే కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్‌లోకి అనుమతి ఉం టుందని పేర్కొన్నారు. అభ్యర్థి వెంట వచ్చే మిగితా వారు కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ బయట ఉండి ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలను కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ బయట ఉన్న ఖాళీ స్థలంలో ఒక క్రమపద్ధతిలో నిలుపుకుని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు (పోలీస్ సిబ్బందికి) సహకరించాలన్నారు. అదేవిధంగా ప్రతి రోజు ఒక్కరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి వస్తే ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్‌వో ఛాంబర్‌లోకి అనుమతి ఇస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటలలోపు చాంబర్ వద్ద కు వచ్చిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్ వేసే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. 3 గంటల తర్వాత వచ్చే అభ్యర్థులకు నామినేషన్ వేసే అవకాశం ఉండదని, నామినేషన్ వేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటలలోపే ఆర్‌వో చాంబర్ వద్దకు చేరుకోవాలని తెలిపారు. అంతేకాకుండా నామినేషన్ వేసే రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లోకి ఇతరులు ఎవరికీ అనుమతి లేదని.. మీడియా మిత్రులు కూడా ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...