పది మొదలాయె..


Sat,March 16, 2019 11:42 PM

-జిల్లావ్యాప్తంగా టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం
-తొలిరోజు ప్రశాంతం..17 మంది విద్యార్థులు గైర్హాజరు
-పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, జేసీ, డీఈవో
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ/సిద్దిపేట రూరల్ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 77 పరీక్ష కేంద్రాల్లో 14,470 మంది విద్యార్థులకు గానూ 14453 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈవో రవికాంతారావు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తడ్కపల్లి ఆవాస విద్యాలయం, తడ్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జేసీ పద్మాకర్ నంగునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు అక్కెన పల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించారు. డీఈవో రవికాంతారావు సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల, ఇందిరానగర్ పాఠశాల, నర్సాపూర్ ఉర్దూ మీడియం బాలికల పాఠశాల, కాకతీయ ప్రైవేటు పాఠశాల, శ్రీ చైతన్య పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఎలాంటి మాస్‌కాపీయింగ్ జరుగకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిగిన ప్రథమ భాష మొదటి పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...