మండే ఎండ


Sat,March 16, 2019 12:18 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : వేసవి కాలం రానే వచ్చింది. భానుడు మెల్లమెల్లగా తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు పెరుగుతుండడంతో జనం ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల రక్షణలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేటప్పుడు తలకు తెల్లటి కాటన్ దుస్తులు లేదా క్యాప్‌లు, గొడుగులు ధరించి వెళ్తున్నారు. కూలింగ్ గ్లాసెస్‌ను వాడుతున్నారు. రోజురోజుకూ ఎండలు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు పెరుగుతుండడంతో కూలర్లు, రంజన్లు అమ్మేవారికి గిరాకీ పెరిగింది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...