నేటి నుంచి పది పరీక్షలు


Sat,March 16, 2019 12:18 AM

సిద్దిపేట రూరల్ : నేటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 77 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణకు 22 మండలాల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాలో మొత్తం 14,853 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 11,583 మంది కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 3000మంది ఉన్నారు. ఉద యం 9గంటల నుంచి 12.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలు సజావుగా జరుగడానికి, నిరంతర పర్యవేక్షణ కోసం 4 ైఫ్లెయింగ్ స్వాడ్ బృం దాలు, 77 సిట్టింగ్ స్కాడ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు 92, డిపార్ట్‌మెంట్ అధికారులు 92, కస్టోడియన్లు 13, జాయింట్ కస్టోడియంను 42మందిని ప్రత్యేకంగా నియమించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకున్నా వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని డీఈవో రవికాంతారావు తెలిపారు. జిరాక్స్ హాల్ టిక్కెట్లపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సంతకం తీసుకుంటే సరిపోతుందన్నారు.

విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ :మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. ఇం దుకు జిల్లా యంత్రాంగం అన్ని వసతులు కల్పించారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పదో తరగతి ఫలితాలే పునాది, అందుకు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని ఆకాంక్షించారు.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పదో తరగతి విద్యార్థులకుఉ కలెక్టర్ కృష్ణభాస్కర్‌ఆల్‌దిబెస్ట్ చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్‌లో పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 77 పరీక్ష కేం ద్రాల్లో 14,853 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని డీఈవో రవికాంత్‌రావుకు సూచించారు. వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోకు సూచించారు.
విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి

ఆర్టీసీ ఆర్‌ఎం రఘునాథ్‌రావు
సంగారెడ్డి టౌన్ : పదో తరగతి పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రఘునాథ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా చెల్లుబాటులో ఉన్న బస్‌పాస్‌లను చూపించాలన్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులలో కంబైన్డు టికెట్ ఆధారంగా బస్‌పాస్‌ను కలిగి ఉన్న రూట్‌తో సంబంధం లేకుండా అనుమతించడం జరుగుతుందన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...