విజయీభవ!


Thu,March 14, 2019 11:03 PM

-రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
-సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
-జిల్లాలో పరీక్షలు రాయనున్న 14,853 మంది విద్యార్థులు
-77 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
-ఐదు నిమిషాలు ఆలస్యమైనా నో ఎంట్రీ
సిద్దిపేట రూరల్ : పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యా హ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకో వాలి. పరీక్ష ప్రారంభమైన (ఉదయం 9.30 గంటలు) 5 నిమిషాల వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతి ఇవ్వరు. జిల్లా వ్యాప్తంగా 14,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవి కాంతారావు నమస్తే తెలంగాణకు వివరించిచారు. జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు 77 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. వీటిలో నాలుగు ప్రైవేట్ పాఠశాలలు, మిగతా 73 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 14,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 11,853 మంది, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 3000 మంది ఉన్నారు. విద్యుత్ శాఖ, రెవెన్యూ, పోలీసు, వైద్యా ధికారుల సమన్వయంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తు న్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం, ఒక ఏఎన్‌ఎం ఉండేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రానికి సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పోలీసులు తీసుకుం టున్నారు.

77 పరీక్ష కేంద్రాలు
పదో తరగతి వార్షిక పరీక్షలకు 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8.30 గంటలకే పరీక్ష హాల్‌లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతివ్వరు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, ఈ నెల 22న జరుగనున్న ఇంగ్లిషు పరీక్షను ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. ఏప్రిల్ 3వ తేదీన పదో తరగతి పరీక్షలు ముగుస్తాయి.

పరీక్ష నిర్వహణలో
1) డీఈవో
జిల్లాలోని 77 పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం. పరీక్ష కేం ద్రాల వద్ద ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే భర్తీకి చర్యలు చేపట్టడం. నిబంధనలకు లోబడి ఇబ్బందు లు లేకుండా పూర్తి చర్యలు తీసుకోవడం.
2) ఏసీజీఈ
జిల్లాలోని అన్నిపరీక్ష కేంద్రాల అవసరాల
ఏర్పాట్లలో డీఈవోకు సహకరించడం.
3) రూట్ ఆఫీసర్లు
జిల్లాలోని పరీక్ష కేంద్రాలకు వివిధ మార్గాల ద్వారా ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రి చేరవేయడానికి ప్రధాన పాత్ర. సంబంధిత పోలీస్ స్టేషన్‌లలో సంబంధిత కస్టోడియన్లకు సామగ్రి అప్పగించడం.
4) కస్టోడియన్
ఎంపిక చేయబడ్డ పోలీస్ స్టేషన్‌ల్లో, అలాట్ చేయ బడిన పరీక్ష కేంద్ర ముఖ్య పర్యవేక్షకులు. శాఖాధిపతు లకు పరీక్ష సామగ్రి రూట్ అధికారుల ద్వారా తీసుకొని వారికి అందజేయడం. లోటుపాట్లు ఇతర సామగ్రి కొరతను కేంద్రాల వారీగా తెలియజేయడం.
5) ముఖ్య పర్యవేక్షకులు
తమ తమ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు సంబం ధించిన నంబర్లతో పరీక్ష గదులు కేటాయించారు. హాల్ పర్యవేక్షకులకు అభ్యర్థులకు సూచనలు తెలియజేయడం, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కాపీ జరుగకుండా చూడడం. సమయం ప్రకారం ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడం, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా పరిశీలకులు, స్ట్రాంగ్ రూం అధికారులు కేంద్రాన్ని పరిశీలించినప్పుడు సహకరించడం.
6) ఇన్విజిలెటర్స్
తమకు కేటాయించిన హాల్‌లో ఎలాంటి అవక తవకలు జరుగకుండా చూడడం. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు కాపీలు జరుగకుండా చూడడంతో పాటు ఏ అభ్యర్థికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఉత్తర్వులు పాటి స్తూ పర్యవేక్షణ చేస్తూ కేంద్రంలోని ముఖ్య పర్యవేక్షకులు, శాఖాధిపతుల సూచనలు పాటించడం.
7) ఫ్లయింగ్ స్కాడ్స్
జిల్లాలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్షల నిర్వ హణ తీరుతెన్నులు, అభ్యర్థులు నిబంధనలు అతిక్ర మించి పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో వారిని మాల్ ప్రాక్టీసు కేసుల కింద బుక్ చేయడం.
8) అభ్యర్థులు
హాల్ టికెట్లు, సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బరు, స్కేల్ లాంటి అత్యవసర సామగ్రి మాత్రమే తెచ్చు కోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి కంటే 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవడం. హాల్‌లోకి వెళ్లి ప్రధాన జవాబు పత్రాన్ని సరైన సమాచారంతో నిం పడం, ఓఎంఆర్‌లు శ్రద్ధగా చదివి తప్పులుంటే ఆ సమాచారాన్ని సంబంధిత పర్యవేక్షకులకు తెలుప డం. పిన్ చేసి స్టిక్కర్లు వేయడం, ఉదయం 9.30 గం టలకు ప్రశ్నపత్రం అందుకొని సూచనలు చదివి జవాబులు రాయాలి. ప్రధాన జవాబు పత్రం సంఖ్యనే అదనపు జవాబు పత్రంపైనే, మ్యాప్, గ్రాఫ్‌లపై రాయడం, పూర్తయిన వెంటనే పూర్తి అదనపు పత్రాల సంఖ్యను ఓఎంఆర్‌పై రాయాలి. పరీక్ష కేంద్రానికి సాధారణ దుస్తుల్లోనే హాజరు కావడం ముఖ్యం. ఎలాంటి మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...