ఇంగ్లిష్‌పై భయాన్ని వీడాలి


Thu,March 14, 2019 10:58 PM

సిద్దిపేట అర్బన్ : విద్యార్థులు మొదటగా ఇంగ్లిష్ భాషపై ఉన్న భయాన్ని వీడాలని, ఆంగ్లం కూడా మన మాతృభాషవంటిదేనని, అభ్యాసం చేస్తే భాషను నేర్చుకోవడం సులభమని విద్యాశాఖ ప్రత్యేకాధికారి ప్రియదర్శిని, డీఈవో డా.రవికాంతారావు సూచించారు. గురుకులాలు, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, తద్వారా వారిలో ఇంగ్లిష్ భాషపై ప్రావీణ్యం కల్పించేందుకు ఎన్సాన్‌పల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో వర్క్‌షాప్ నిర్వహిస్తు న్నారు. గురువారం ఎన్సాన్‌పల్లి పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్ విష్ణువర్దన్‌రెడ్డితో కలిసి విద్యాశాఖ ప్రత్యేకాధికారి ప్రియదర్శిణి, డీఈవో డా.రవికాంతారావులు వర్క్‌షాపు పరిశీలించారు. వర్క్‌షాపు రెండో రోజు విద్యార్థులతో పద్యాలు రాయించారు. వీటిని అధికా రులు ప్రత్యేకంగా పరిశీలించి విద్యార్థుల మనోగతాలను తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఎన్సాన్‌పల్లిలో నిర్వహిస్తున్న మూడు రోజుల వర్క్‌పాపు నిర్వాహణ చాలా బాగుందని పేర్కొన్నారు. విద్యార్థులు స్వతహాగా కథలు, పద్యాలను చక్కగా ఇంగ్లిష్‌లో రాయడం విశేషమన్నారు. శుక్రవారం నాటి తో వర్క్‌షాపు ముగుస్తుందని ఆయన తెలిపారు. వర్క్‌షాపులో విద్యార్థులు రాసిన వాటిని పుస్తకాలుగా ముద్రించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపిస్తామన్నారు. ప్రిన్సిపాల్ విష్ణువర్దన్‌రెడ్డి మా ట్లాడుతూ.. విద్యార్థులు మొదటి రోజు కథలు రాయగా, రెండో రోజు పద్యాలు రాశారని, మూడో రోజు లఘుచిత్రాలు, కొరియోగ్రఫీ చేస్తారన్నారు. అన్ని అం శాలు సందేశాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో శ్యాంప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పదిలో 10 జీపీఏ సాధిస్తే రూ.25 వేలు..
గజ్వేల్ టౌన్ : పదో తరగతి విద్యార్థులు పట్టుదలతోవార్షిక పరీక్షలు రాయాలని డీఈవో రవికాంతారావు అన్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం, బాలికల, బాలుర ఎడ్యుకేషన్ హబ్ లో వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఈ సమయం ఎంతో కీలకమైనదని, మంచి పాయింట్లు వచ్చేలా 11 పేపర్లు బాగా రాయాలన్నారు. పదిలో మంచి పాయింట్లు సాధిస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని వివరించారు. ప్రత్యేక తరగతులతోపాటు జిల్లాలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు. తాను ఆకస్మికంగా గ్రామాల్లో పర్యటించి, విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడిన సందర్భంలో బాగా చదువుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ఎంతో శ్రమించినట్లు అభినందించారు. పరీక్ష కేం ద్రానికి ముందుగా చేరుకుని నిదానంగా రాయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పదో తరగతి విద్యార్థులు 10 పాయింట్లు సాధిస్తే ఎమ్మెల్యే హరీశ్‌రావు రూ.25 వేలు ఇస్తారని ప్రకటించారని, అందుకొసం ప్రతి విద్యార్థి పోటీతో చదివి 10జీపీఏ సాధించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పిస్తున్నామని, జిల్లావాప్తంగా 75 రెగ్యులర్, రెండు ప్రైవేట్ విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా గజ్వేల్‌లో 8 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. డీఈవో వెంట ఎంఈవో సునీత ఉన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...