27 నుంచి ఇంటర్ పరీక్షలు


Thu,February 21, 2019 11:59 PM

-జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాలు
-పరీక్ష రాయనున్న 2,331 మంది విద్యార్థులు
సిద్దిపేట రూరల్ : ప్రతి విద్యాసంవత్సరం వా ర్షిక పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలతోనే ప్రారంభమవుతాయి. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు వివిధ కోర్సుల్లో డిగ్రీ చేసేందుకు ఇంటర్ మార్కులు కీలకంగా మారుతాయి. ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థి సాధించిన ఫలితాలే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం..
ఈ నెల 27తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరుగనుంది. మొత్తం విద్యార్థులు 2,331 మంది కాగా, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 12,322 మంది బుధవారం పరీక్ష రాయనున్నారు. గురువారం ప్రారంభమయ్యే రెండో సంవత్సరం పరీక్షలను 16,009 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 19 ప్రభుత్వ కళాశాలలు, 16 ప్రైవేట్ కళాశాలలు, 4 ఆదర్శ పాఠశాలలో కలిపి మొత్తం 39 సెంటర్లు ఏర్పాటు చేశారు. జనరల్ విభాగం మొదటి సంవత్సరం పరీక్షలు 27తేదీన ప్రారంభమై మార్చి 12 తేదీన పూర్తి అవుతాయి. జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 2తేదీన ప్రారంభమై మార్చి 13న పూర్తి అవుతాయి. వొకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం సంవత్సరం పరీక్షలు 27వ తేదీన, రెండో సంవత్సరం పరీక్షలు 2న ప్రారంభమై మార్చి 9,11 తేదీల్లో పూర్తవుతాయి. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను ఆయా కళాశాలల నుంచి నేరుగా గానీ లేదా బోర్డు వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి భూపతి సుధాకర్ తెలిపారు.

ఒత్తిడి జయిస్తే విజయం
వార్షిక పరీక్షలంటే సాధారణంగా విద్యార్థులు చాలా ఒత్తిడికి లోనవుతారు. వీరికి తోడు తల్లితంవూడుల సైతం తమ పిల్లలు వార్షిక పరీక్షలు రాస్తున్నారు అనే ఆందోళనలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు భయవూబాంతులకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటా యి. విద్యార్థులు పరీక్షలంటే భయం పడకుండా ప్రణాళిక బద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల ముందు రోజు పరీక్షకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకొని పరీక్షా కేంద్రం వద్దకు గంట ముందే చేరుకోవాలి. ఇందుకోసం తల్లితంవూడులు తమ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ప్రశాంతంగా ఉంటే విద్యార్థులు సైతం ధైర్యంగా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...