డివిజన్‌లో ‘కంటి వెలుగు’ విజయవంతం


Thu,February 21, 2019 11:54 PM

-మొత్తం 1,0,162మందికి కంటి పరీక్షలు
-2,79మందికి కండ్లద్దాలు పంపిణీ
-,223మంది ఆపరేషన్ కోసం రెఫర్
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్షికమం హు స్నాబాద్ డివిజన్‌లో విజయవంతమైంది. డివిజన్‌లోని ఐ దు మండలాల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తయ్యాయి. గతేడాది ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన కంటి వెలుగు శిబిరాలు ఈ నెల 1వ తేదీతో ముగిశాయి. ఆరు నెలల మూ డు రోజుల పాటు కంటి వైద్య శిబిరాలు కొనసాగాయి. మం డలానికో టీం చొప్పున ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించిన వైద్యులు, వైద్య సిబ్బంది కంటి స మస్య ఉన్న ప్రతి ఒక్కరినీ పరీక్షించారు. అవసరమైన వా రికి కండ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు ఆపరేషన్ కోసం రెఫర్ చేయడం, మరికొందరికి మందులు, ఐడ్రాప్స్ ఉచితంగా ఇచ్చి కంటి సమస్యలను తగ్గించేందుకు కృషి చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయడం, అవసరమైన అద్దాలు, మందులు ఇవ్వడం, ఆపరేషన్ కూడా ఉచితంగా చేయిస్తుండడంతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డివిజన్‌లో 1,0,162మందికి కంటి పరీక్షలు..
డివిజన్‌లో మొత్తం 1,0,162మందికి కంటి పరీక్షలు ని ర్వహించారు. బెజ్జంకి మండలంలో 20,992మందికి కం టి పరీక్షలు చేయగా అక్కన్నపేట మండలంలో 20, 929మందికి, హుస్నాబాద్‌లో 25,65, కోహెడ మండలంలో 22,117, మద్దూరు మండలంలో 1,466మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల అనంత రం మొత్తం 32,79మందికి కండ్లద్దాలు పంపిణీ చే శారు. బెజ్జంకి మండలంలో 5,927మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా.. అక్కన్నపేట మండలంలో 5, 597మందికి, హుస్నాబాద్ మండలంలో 7,520మందికి, కోహెడలో 7,44మందికి, మద్దూరు మండలంలో 6, 297మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు.
ఆపరేషన్ కోసం 6,223 మంది..
డివిజన్‌లో మొత్తం 6,223మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. మరో 1,00 మంది కంటిలో చర్మం పెరుగడం లాంటి తదితర సమస్యలతో చిన్నపాటి ఆపరేషన్ అవసరమైన వారు కూడా ఉన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...