పీహెచ్‌సీ, యునానీ దవాఖానల ఆకస్మిక తనిఖీ


Thu,February 21, 2019 11:52 PM

సిబ్బంది నిర్లక్ష్యంపై ఎంపీపీ ఆగ్రహం
-వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు
మద్దూరు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు యునానీ దవాఖానలను ఎంపీపీ మంద మాధవి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను ఎంపీపీ పరిశీలించారు. అదేవిధంగా యునానీ దవాఖానను తనిఖీ చేసేందుకు వెళ్లిన సమయంలో దవాఖానకు తాళం వేసి ఉంది. ఈ సందర్భంగా ఎంపీపీ మాధవి మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో పనిచేసే డాక్టర్‌తో పాటు సీహెచ్‌వో, సీనియర్ అసిస్టెంట్‌లు విధులకు హాజరు కాలేదన్నారు. పీహెచ్‌సీ మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో ఎలాంటి నమోదు లేకుండా సీనియర్ అసిస్టెంట్, సిబ్బంది హాజరు రిజిస్టర్‌లో టూర్ అని నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ కొంతకాలంగా పీహెచ్‌సీకి రాకున్నా వచ్చినట్లు హాజరు రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారని విమర్శించారు. సిబ్బంది ఇష్టారీతిన సమయపాలన లేకుండా వంతులవారీగా విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న యునానీ దవాఖాన ఉదయం 11-30గం.లకు కూడా తెరుచుకోలేదన్నారు. గతంలో యునానీ దవాఖానను ఎమ్మెల్యే ముత్తిడ్డి యాదగిరిడ్డితో సహా మండల ప్రజావూపతినిధులు తనిఖీ చేసి పద్ధతిని మార్చుకోవాలని సదరు దవాఖాన వైద్యున్ని హెచ్చరించినప్పటికి మార్పు రాలేదన్నారు. విధుల్లో అలక్ష్యం వహించి పేద ప్రజలకు వైద్య సేవలకు దూరం చేస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. డీఎంఅండ్‌హెచ్‌వో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె వెంట మండల పరిషత్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాజు, రేబర్తి ఉపసర్పంచ్ బొద్దుల చంద్రమౌళి, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దామెర మల్లేశం తదితరులు ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...