ముంపు బాధితులకు అండగా సీఎం కేసీఆర్


Thu,February 21, 2019 11:52 PM

-పక్కా ఇల్లుతో పాటు రూ.7.50 లక్షల పరిహారం
-సామాజిక ఆర్థిక సర్వేకు సహకరించండి
-సిద్దిపేట ఆర్డీవో జయచంవూదాడ్డి
తొగుట: సీఎం కేసీఆర్ కేసీఆర్ ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని సిద్దిపేట ఆర్డీవో జయచంవూదాడ్డి అన్నారు. గురువారం మండలంలోని లకా్ష్మపూర్‌లో ముంపు బాధితులతో మాట్లాడారు. 2013 చట్టం ప్రకారం ముంపు గ్రామాల ప్రజలకు నష్టం ఏర్పడుతుందన్నారు. 2013 చట్టం ప్రకారం ఒక కుటుంబానికి 75 గజాల స్థ లం, ఇందిరా ఆవాస యోజన కింద ఇల్లు నిర్మిం చి ఇస్తామని, ఇల్లు వద్దు అనుకుంటే రూ.1.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ గ్రహించి వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రతి కుటుంబానికి 250 గజాల ప్లాటు, అందులో డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఇండ్లు వద్దు అనుకుంటే రూ.5,04,000, అలాగే పరిహారం రూపేనా రూ.7,50,000 ఇవ్వ న్నుట్లు చెప్పారు. 1 ఏండ్ల నిండిన వారిని ఒక కుటుంబంగా భావించడం జరుగుతుందన్నారు. సామాజిక ఆర్థిక సర్వే ద్వారా ఇప్పటికే వేములఘాట్, రాంపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, ఎర్రవల్లి, సింగారం గ్రామాల వారికి సంబంధించిన భవిష్యత్ గ్రామాల లేఅవుట్‌ను తయారు చేసినట్లు తెలి పారు. సింగారం, ఎర్రవల్లి గ్రామాలకు ముట్రాజ్‌పల్లిలో 00 ఇండ్లు నిర్మించామని తెలిపారు. ఇంకా 1200 ఇండ్లు ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. పల్లెపహాడ్, లకా్ష్మపూర్ సామాజిక ఆర్థిక సర్వే నిలిచిపోయిందని, తద్వారా ప్రయోజనం కలిగించడానికి ప్రణాళిక చేయడానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా సామాజిక ఆర్థిక సర్వేకు సహకరిస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక ఆర్థిక సర్వేకు సహకరించకుంటే 2013చట్టం ప్రకారం వెళ్తామని తెలిపారు. కొత్తగా పెండ్లి చేసుకున్న కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్షికమంలో తహసీల్దార్ వీర్‌సింగ్, సర్పంచ్ కొల్చె ల్మ స్వామి, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, వీఆర్వోలు దేవరాజ్, అజయ్ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...