హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యం


Wed,February 20, 2019 11:24 PM

-అన్ని వసతులున్న పట్టణంగా తీర్చిద్దుతాం
-ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
-రూ.2.26కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-రూ.కోటితో నిర్మించిన మండల పరిషత్ నూతన భవనం ప్రారంభం
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ అభివృద్ధే లక్ష్యమని, అన్ని వసతులున్న పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం హుస్నాబాద్‌లో రూ.50లక్షలతో నిర్మించే మున్సిపల్ భవనంతో పాటు రూ.కోటితో నిర్మించే రైతు బజార్, రూ.46లక్షలతో నిర్మించే షాదీఖానా, రూ.30లక్షలతో మార్కెట్‌లో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం రూ2.26కోట్ల అభివృద్ధి పనులకు ఎ మ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.కోటి నిధులతో నిర్మించిన మండల పరిషత్ నూతన భవనానికి ప్రారంభించారు. అంతకు ముందు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ అభివృద్ధి చెందుతున్న పట్టణమని, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శా ఖల భవనాలు ఉన్నా, మరికొన్ని శాఖల భవనా లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్ట ణ నడిబొడ్డున పాత ఠాణా వద్ద రైతు బజార్ నిర్మిస్తున్నామని, ఇది ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సిద్దిపేట తరహా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయిస్తామన్నారు. మిషన్ భగీరథ పనులు కూడా తుది దశకు వ చ్చాయని, త్వరలోనే పట్టణ ప్రజలు ఫ్లోరైడ్ ర హిత మంచినీరు తాగుతారన్నారు. పట్టణంలో షాదీఖానా నిర్మిస్తున్నామన్నారు. హుస్నాబాద్ మార్కెట్‌లో ట్రేడర్లకు సౌకర్యవంతంగా ఉండే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ సహకారంతో మండల పరిషత్ నూతన భవనం స కాలం పూర్తి చేయించగలిగామన్నారు. రాబో యే రోజుల్లోనూ హుస్నాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రజలు, స్థానిక నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ము న్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూ క్య మంగ, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, తహసీల్దార్ దశరథ్‌సింగ్, ఎంపీడీవో దమ్మని రాము, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాంగోపాల్‌రావు, మార్కెట్ వైస్ చైర్మన్ షాబుద్దీన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుంట మల్లయ్య, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణాధ్యక్షుడు అన్వర్, ఇన్‌చార్జి అశోక్‌బాబు, ఏజీపీ కన్నోజు రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ బీలూనాయక్, నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...