స్వయం ఉపాధి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు


Wed,February 20, 2019 11:22 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ జిల్లాలో నైపుణ్య శిక్షణ పొందిన కేటగిరిలో స్వయం ఉపాధి పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి 26 వరకు ఇంటర్వ్యూలను సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ తెలిపారు. 22వ తేదీన దౌల్తాబాద్, దుబ్బాక, దుబ్బాక అర్బన్, కొమురవెల్లి, మిరుదొడ్డి, నంగునూరు, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, 23న చిన్నకోడూరు, చేర్యాల, గజ్వేల్, గజ్వేల్ అర్బన్, జగదేవ్‌పూర్, కొండపాక, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్, 26న అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్, హుస్నాబాద్ అర్బన్, కోహెడ, మద్దూరు మండలాలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు కులం, నివాసం, ఆదాయం, డ్రైవింగ్ లైసెన్, ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, పట్టాదారు పాసుపుస్తకం, పథకానికి సంబంధించిన పర్మిషన్, లైసెన్, రేషన్ కార్డు, శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్, వికలాంగ సర్టిఫికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, పాసుపోర్ట్ సైజు ఫొటోలు తీసుకొని హాజరు కావాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లేదా డీఆర్‌డీఏ, మెప్మా, ఏబీఆర్‌సెట్ లేదా ఇతర సంస్థల్లో శిక్షణ పొంది సర్టిఫికెట్ గల అభ్యర్థులే అర్హులని తెలిపారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...