ఒత్తిడిని జయిస్తే విజయం మీదే


Wed,February 20, 2019 11:21 PM

-సైకాలజిస్ట్ నాగేశ్వర్‌రావు
-పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
-డీఈవో రవికాంతారావు

చేర్యాల,నమస్తే తెలంగాణ : విద్యార్థులు ఒత్తిడి జయిస్తే వి జ యం తప్పక సొంతం అవుతుందని ప్రముఖ సైకాలజిస్ట్ డా క్టర్ గంప నాగేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని కల్యాణి గార్డెన్స్‌లో బుధవారం చేర్యాల,కొమురవెల్లి మండలాలకు చెందిన 1200 మంది పదో తరగతి విద్యార్థులకు నాగేశ్వర్‌రావు పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావాలో కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఈ సందర్భంగా చేర్యాల,కొమురవెల్లి మండలాల ఎం ఈ వో జి.రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. పదో త రగతి విద్యార్థులు తమ విలువై న సమయం వృథా చేయకుం డా వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏలాంటి భయం, భావోద్వేగాలకు లోనుకాకుం డా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. వి ద్యార్థులు ఆ యా పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు తప్పకుండా పాటించి వార్షిక ప రీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పరీక్షల పై విషయంలో ఎలాంటి ఒత్తిడి లోనుకాకుండా ఉండేందుకు పలు టిప్స్‌ను విద్యార్థులకు వివరించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈవో
విద్యార్థులు పదో గరతతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి వారి తల్లిదండ్రులు గర్వించే విధంగా కష్టపడాలని కోరారు. పదో తరగతి పరీక్షలు అనగానే కొందరు విద్యార్థుల్లో భయాందోళనలు చోటు చేసుకుంటాయని, వాటిని పక్కన పెడితే విజయం వారి దరి చేరుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు అన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఐలయ్య, లకా్ష్మరెడ్డి, లక్ష్మి, నరేందర్, శ్రీరాములు, శ్రీనివాస్, మంజుభార్గవి పాల్గొన్నారు. కార్యక్రమానికి దాతలుగా టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు, హ్యాండ్ బాల్ సొసైటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, కందుకూరి ఉపేందర్, కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ పాలక మండలి సభ్యుడు మురళి వ్యవహరించారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...