రెవెన్యూ డివిజన్ కోసం జీపీలు తీర్మానం చేయాలి


Wed,February 20, 2019 11:21 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : ఎంతో చరిత్ర కలిగిని చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ.. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచ్‌లు తీర్మానాలు చేయాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు కోరారు. బుధవారం పట్టణంలో జరిగిన సమావేశంలో సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డివిజన్ స్థాయి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఐక్యంగా ఉద్యమిస్తే సీఎం సీఎం కేసీఆర్ తప్పక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు పోతుగంటి ప్రసాద్, తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, రాళ్లబండి భాస్కర్, చంద్ర శ్రీకాంత్, రాచమల్ల శ్రీనివాస్, నీలం వినయ్, నసీరుద్దీన్, భాస్కర్, కిషన్, దొమ్మాట రాజు తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...