గర్వించేలా గజ్వేల్


Tue,February 19, 2019 11:15 PM

-వ్యాపార, వాణిజ్య, రవాణా తదితర రంగాల్లో అద్భుతాలు సొంతం
-ఐదేండ్లలో రూ. 500కోట్లకు పైగా కేటాయించిన ప్రభుత్వం
-విద్య, వైద్యం, పర్యాటకానికి ప్రాధాన్యం
-అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం
-రింగురోడ్డు పట్టణానికి మరో మణిహారం
-ఇంటింటికీ నల్లా, 24 గంటల నీటి సరఫరా ప్రయోగాత్మకం
-డివైడర్లు, ఎల్‌ఈడీ మెరుపులతో రహదారులు
-స్థానికులకు చేరువైన రైల్వే ప్రయాణం
-సీఎం కేసీఆర్‌తోనే గజ్వేల్‌కు అందివచ్చిన అవకాశాలు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: గజ్వేల్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో స్మార్ట్ సిటీగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నది. ఐదేండ్లలో అన్నిరంగాల్లో ఊహించని అభివృద్ధితో మిగతా పట్టణాలకు ఆదర్శంగా నిలిచింది. విద్య, వైద్యం, మార్కెటింగ్, రోడ్లు, విద్యుత్, మంచినీరు, పచ్చదనం-పరిశువూభత తదితర రంగాల్లో మేటిగా మారింది. ఐదేండ్లలో రూ.500కోట్లకు పైగా నిధులతో జరిగిన గజ్వేల్ అభివృద్ధి పట్టణ పరిసర ప్రాంతాలను సైతం బంగారు తునకాలుగా మార్చింది. సీఎం కేసీఆర్ వల్లే గజ్వేల్ అభివృద్ధికి అవకాశాలు అందివచ్చాయని మరో ఐదేండ్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పట్టణంగా గుర్తింపు పొందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి స్థానికులను సైతం సంబురం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. పట్టణం నలు దిక్కులుగా విస్తరించడానికి సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం వేసిన ప్రణాళిక అద్భుత విజయాలను అం దించింది.

గజ్వేల్ చుట్టూ నిర్మించిన రింగురోడ్డు పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి వైపు పరుగులు తీయించింది. అంతర్గత రహదారులు, ప్రభు త్వ కార్యాలయాల నిర్మాణంతోపాటు విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించడం విద్య, వైద్యం కోసం అధునాతన వసతులు అందుబాటులోకి తేవ డం, పట్టణ రూపు రేఖలు మార్చడమే కాకుండా ప్రజలకు అత్యంత అవసరమైన సౌకర్యాలను అం దుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడంతోపాటు స్థానికులకు ఆహ్లా దం, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం కోసం పచ్చదనం, పార్కుల నిర్మాణం, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి గజ్వేల్‌కు కొత్త హంగులు తెచ్చిపెట్టినట్లయింది. ఇప్పుడు గజ్వేల్ ఓ మహా అద్భుత పట్టణంగా విరాజిల్లుతుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ సిటీగా మార్చాలని ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగానే ఐదేండ్లలో అనేక పనులు పూర్తయ్యా యి. ఇప్పటికే స్థానికంగా జరిగిన అభివృద్ధిపై ఆకర్షితులవుతున్న ఇతర ప్రాంతాల ప్రజలు గజ్వేల్‌లో ఇల్లు కట్టుకోవాలని, స్థానికంగా ఆస్తులు పెంచుకోవాలని ఆరాట పడుతుండగా, పలు ఇంటిక్షిగేటెడ్ సంస్థలకు చెందిన దుకాణా సముదాయాలు, వ్యా పార, వాణిజ్య కేంద్రాలు తరలివస్తున్నాయి.

అందివచ్చిన కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ వైద్యం
గజ్వేల్‌లో ప్రభుత్వ వైద్యం అత్యంత అధునాతన సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ.1.50కోట్లతో విశాలమైన ప్రాంతంలో నిర్మించిన వంద పడకల దవాఖాన సకల వ్యాధులను నయం చేసే పెద్ద దవాఖానగా మారింది. జిల్లా దవాఖానగా వసతులు సొంతం చేసుకోగా, ఐసీయూ, డయాలసిస్ తదితర అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.కోటిన్నరతో హైరిస్క్ సెంటర్ కూడా అందుబాటులో ఉండడంతో పిల్లల ఆరోగ్యానికి భద్రత ఏర్పడింది.

సంగాపూర్ వద్ద కేసీఆర్ న్యూసిటీ
గజ్వేల్ పట్టణానికే మరో అందాన్ని అందిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు, జర్నలిస్టు కాలనీ, ఆర్‌ఆర్ కాలనీలు కొత్త నగరంగా ఖ్యాతికెక్కనుంది. పేదల కోసం 1250 ఇండ్ల నిర్మాణంతో పాటు జర్నలిస్టుల కోసం 50ఇండ్లు, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు 400ఎకరాల్లో ఇండ్ల నిర్మాణం వేర్వేరుగా కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం సుమారు రూ.106 కోట్ల 77లక్షల ప్రభుత్వం వెచ్చించింది. ఇందులో ఇండ్ల నిర్మాణం కోసం రూ. 66.25కోట్లు కాగా, సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాల్, జర్నలిస్టు కాలనీ, ఇతర నిర్మాణాల కోసం రూ.40.52 కోట్లు, ఆర్‌ఆర్ కాలనీ కోసం రూ.65.32కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తున్నది.

ఆహ్లాదం,ఆరోగ్యం
గజ్వేల్ పట్టణ ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని అందించడం కోసం పార్కులు ఏర్పాటు చేశారు. 117 హెక్టార్లలో 4.1కోట్లతో అర్బన్‌పార్కు సంగాపూర్ వద్ద నిర్మించారు. ఇందులో నక్షత్ర, రాశివనాలతోపాటు పలు అద్భుత కట్టడాలు, మొక్కలను ఏర్పాటు చేశారు. పట్టణ శివారులో హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద రూ.కోటితో హెర్బల్ పార్కు నిర్మించారు. ఇవి రెండు గజ్వేల్ పట్టణ ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.

మినీట్యాంక్‌బండ్‌లుగా పట్టణ చెరువులు
గజ్వేల్ పట్టణ పరిసరాల్లో చెరువుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాముఖ్యతను చూపించారు. భూగర్భ జలాల పెంపుతో పాటు పచ్చని వనాలతో పరిసరాలు విరాజిల్లాలని పర్యాటక కేంద్రంగా మారాలని భావించారు. రూ .65కోట్లతో పాండవుల చెరువు సుందరీకరణ, రూ. 6.55కోట్లతో ఊరచెరువు సుందరీకరణ, రూ.3కోట్లతో పార్శికుంట అభివృద్ధి, రూ.1.92కోట్లతో రాజిడ్డిపల్లి కుంట అభివృద్ధి పనులు ముగింపు స్థాయికి చేరుకున్నాయి. పట్టణ వాసులకు మినీట్యాంక్‌బండ్‌లుగా ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా భూగర్భ జలాలను పెంచి, చెరువుల వల్ల పట్టణ పరిసరాలలో పచ్చదనం ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడుతాయి.

అంతర్జాతీయ స్థాయిలో ఇంటిక్షిగేటెడ్ మార్కెట్
రూ.19.5కోట్లతో గజ్వేల్‌లో సమీకృత మార్కెట్‌యార్డును నిర్మించారు. 1.5హెక్టార్లలో నిర్మించిన ఇంటిక్షిగేటెడ్ మార్కెట్‌యార్డులో పూలు, పండ్లు, మాంసం, కూరగాయలు, దుకాణాల సముదాయాలతోపాటు సూపర్ మార్కెట్, పిల్లల ఆట స్థలం, శీతల గిడ్డంగి కేంద్రాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర సాంకేతిక నూతన పరిజ్ఞానంతో అద్భుతంగా నిర్మించారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది.

మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం
రైతుల కోసం ప్రభుత్వం మెరుగైన మార్కెటింగ్ సౌకర్యా న్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.1కోట్ల వ్యయంతో స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చింది. రూ.9 కోట్లతో ముట్రాజ్‌పల్లి వద్ద రెండు భారీ గిడ్డంకుల నిర్మాణం, రూ.4.90కోట్లతో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్‌లో అదనపు గిడ్డంగుల నిర్మాణం, రూ.కోటి 20లక్షలతో పాతూర్ వద్ద రైతు మ్కాట్, రూ.2.3కోట్లతో సంగాపూర్ సమీపంలో కాటన్‌మ్కాట్ ఏర్పాటు చేశారు.పంటను సమీపంలో అమ్ముకోవడానికి సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

అంతర్జాతీయ స్థాయిలో విద్యావూపమాణాలు
గజ్వేల్ విద్యావూపమాణాలకు నిలయంగా మారనున్నది. రూ.146.2కోట్ల వ్యయంతో బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లు నిర్మించారు. ఇందులో కేజీ టు పీజీ విద్యాసౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. హాస్టల్ వసతితోపాటు ఇంటిక్షిగేటెడ్ స్థాయి తరగతి గదులు, హాస్టల్ వసతులు ఉండగా, సుమారు 60ఎకరాల్లో హబ్‌లు నిర్మించారు. మైనార్టీ, బాలుర, బాలికల, కస్తూర్బా గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉండడంతో యేటా వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కలిగింది.

గజ్వేల్ మణిహారం రింగురోడ్డు
రూ. 223కోట్లతో గజ్వేల్ చుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్డు పట్టణానికి మణిహారంగా మారింది. 22కిలోమీటర్ల పొడవుతో రింగురోడ్డు నిర్మాణంతోపాటు మరో 13.5కిలోమీటర్ల నాలుగు రేడియల్ రోడ్లు పట్టణ అభివృద్ధికి అద్దం పడుతున్నది. రింగురోడ్డు నాలుగు లేన్లుగా నిర్మాణం కొనసాగుతుండగా, ప్రజ్ఞాపూర్ పరిసరాల్లో రాజీవ్హ్రదారి బైపాస్ రోడ్డును కలుపుతూ ఆరు లైన్లుగా నిర్మిస్తున్నారు. ఇది నిర్మించినప్పటి నుంచి గజ్వేల్ పరిసరాల భూముల ధరలు పదింతలు పెరుగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...