రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం


Tue,February 19, 2019 11:08 PM

మద్దూరు : మండలంలోని బెక్కల్ రామచల గుట్టపై వెలసిన శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5గంటలకు స్వామి వారి మేలుకొలుపును నిర్వహించిన అనంతరం దిష్ట్టికుంభం కార్యక్షికమాన్ని హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి-భూమయ్య దం పతుల ఆధ్వర్యంలో జరిపారు. బైరాన్‌పల్లికి చెందిన అర్చకులు పార్నంది శంకరయ్య శర్మ, ఆంజనేయశర్మల వైదిక నిర్వహణలో ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలను నిర్వహించారు. సాయంత్రం వేళా బండ్ల సేవా కార్యక్షికమంతో పా టు దేవుని సేవా కార్యక్షికమాల ను భక్తిక్షిశద్ధలతో నిర్వహించా రు. బ్రహ్మోత్సవాల తొలిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. కార్యక్షికమంలో ఆలయ చైర్మన్ తవిటి సంపత్, సర్పంచ్ కూకట్ల బాలరాజు, అర్చకులు సిద్ధాపురం భద్రప్ప, మఠం శివకుమార్, శివప్ప తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...