ఫైలేరియా నిర్మూలనకు సహకరించాలి


Tue,February 19, 2019 11:07 PM


చేర్యాల, నమస్తే తెలంగాణ: ఫైలేరియా నిర్మూనకు అన్నివర్గాల ప్రజలు తమకు సహకరించాలని కుటుంబ ప్రాంతీయ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి డా.పి. రవీంద్ర కోరారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి విద్యార్థులకు ఫైలేరియా నిర్మూలన, నట్టల నివారణ మందులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైలేరియా నిర్మాలన కోసం ఇచ్చిన మాత్రలను ప్రతిఒక్కరూ వేసుకోవాలని, 2నుంచి 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు ఒక మాత్ర, 6 నుంచి 14 సంవత్సరాల వారికి 2 మాత్రలు వేసుకోవాలన్నారు. 15 సంవత్సరాలు పైబడిన వారు 3మాత్రలు వేసుకోవాలని కోరారు. ఫైలేరియా మందులతో పాటు నట్టల నివారణకు ఆల్బెండజోల్ మాత్రను వేసుకోవాలని సూచించారు. చేర్యాల పీపీ యూ నిట్ ఆధ్వర్యంలో 16వేల మందికి గాను 14వేల మందికి మాత్రలు వేసేందుకు టార్గెట్ పెట్టు కున్నట్లు తెలిపారు. కార్యక్షికమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి డా. విజయ్‌కుమార్, కుటుంబ సం క్షేమ అధికారి డా.రవీందర్, ఆర్‌బీఎస్‌కే జిల్లా ఇన్‌చార్జి చక్రధర్, డాక్టర్ అశ్వినిస్వాతి, సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...