నులిపురుగు, ఫైలేరియా నివారిద్దాం


Tue,February 19, 2019 11:07 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ఫైలేరియా వ్యా ధిని, నులిపురుగును నివారించేందుకు ప్రభుత్వం నేషనల్ డీవార్మింగ్‌డే, ఎండీఏ కార్యక్షికమాల్లో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న వారికి నులిపురుగు నివారణ మాత్రలు, డీఈసీ మాత్రలను మింగించడం జరుగుతుందని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని న్యూ హైస్కూల్‌లో డీవార్మింగ్‌డేలో భాగంగా ఆల్బెండజోల్, డీఈసీ మాత్రలను వేసుకొని కార్యక్షికమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగు నిర్మూలనతో పిల్లల్లో జ్ఞాపకశక్తిని, రక్తహీనత నుంచి కాపాడవచ్చని తెలిపారు. అందరూ ఫైలేరియా వ్యాధి రాకుండా డీఈసీ మాత్రలు వేసుకోవాలని సూచించారు. 19, 20, 21 తేదీల్లో మాత్రలను పంపిణీ చేస్తారన్నారు. 23న ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీలు తిరిగి మాత్రలు వేసే కార్యక్షికమం నిర్వహిస్తారన్నారు. కార్యక్షికమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్, వైద్యులు రవీంద్ర, జమీలాబేగం, శ్రీదేవి, వినోద్‌బాబ్జీ, నర్సింహ, సిబ్బంది కాల్వ చక్రధర్, కొండయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...