సీఎంఆర్‌ఎఫ్ పేదల పాలిట వరం


Mon,February 18, 2019 11:16 PM

దుబ్బాక టౌన్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) పేదల పాలిట వరంగా మారిందని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సోమవారం పలువురికి సీఎంఆర్‌ఎఫ్ పథకం కింద మంజూరైన చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...దుబ్బాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ పథకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే దుబ్బాక నియోజకవర్గానికి తాను ఎక్కువగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంజూరు చేయించానన్నారు. ఈ సందర్భంగా మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాజుకు రూ.11వేల చెక్కును, దుబ్బాకకు చెందిన కారంకంటి రేఖకు రూ.32వేల చెక్కును, బింగి మానసకు రూ.12వేలు, కట్కూరి ప్రశాంత్‌కు రూ.50వేల చెక్కుతో పాటు రూ.2 లక్షల ఎల్‌వోసీని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, బండిరాజు, పర్సకృష్ణ, ఆసస్వామి, పద్మయ్య, చౌదర్‌పల్లి సర్పంచ్ కుమార్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ...
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ వెంకట్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గారెడ్డి, నారాయణరెడ్డి, పిట్ల వెంకటేశ్ ఉన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సౌకర్యాల కల్పనకు చర్యలు..
దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యేను కలిసిన కళాశాల లెక్చరర్లతో ఎమ్మెల్యే సోలిపేట మాట్లాడుతూ...కళాశాల అభివృద్ధి కోసం ఇప్పటికే చందాల ద్వారా రూ.15 లక్షలు సమకూర్చామన్నారు. అట్టి నిధులతో కళాశాలలో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కళాశాలలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు మిషన్‌భగీరథ నీటిని అందిస్తామన్నారు. ప్రిన్సిపాల్ భవానితో పాటు లెక్చరర్లు రమేశ్, స్వాతి, వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, మంజుల, వినోద్, వెంకటేశ్, అంజనేయులు, రాజు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధ్యాపక బృందం సన్మానించారు.
రాయపోల్: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అదుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామనికి చెందిన నవనీతకు రూ. 21వేలచెక్కును అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌గా కొండారి సంధ్యారాణిగణేశ్, నాయకులు శ్రీధర్,స్వామి తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...