నేటి నుంచి రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు


Mon,February 18, 2019 11:16 PM

-ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ పాలకవర్గం
-పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్త జనం
మద్దూరు: ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలన సాగించిన కాకతీయ చక్రవర్తులు తమ పరిపాలన కాలంలో శైవ మ తాన్ని పెంపొందించడంలో భాగంగా ఎన్నో శైవ క్షేత్రాలను ని ర్మించితరించారు. అలాంటి శైవక్షేత్రలలో ప్రసిద్ధికెక్కిన పుణ్య క్షేత్రమే మండలంలోని బెక్కంటి రామలింగేశ్వర ఆలయం. బెక్కల్‌లోని రామచల గుట్టపై క్రీ.శ. 1117 స్వస్తి శ్రీ రాక్షసనా మ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున రుద్రమదేవి రామలింగేశ్వరాలయాన్ని ప్రతిష్ఠించి, చిన్న ఆలయాన్ని నిర్మింపచేసింది. భద్రంగాపురంగా వాసికెక్కిన ఈ ప్రాంతానికి సా మంత రాజుగా మల్లిరెడ్డిని రుద్రమదేవి నియమించి పాలన సాగించింది. మల్లిరెడ్డి రుద్రమదేవి నిర్మించిన చిన్న ఆలయా న్ని చెక్కు చెదరకుండా గర్భాలయంలో నుండునట్లుగా త్రి ము ఖ ఆలయాన్ని అతని పేరు మీద మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కాగా, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మా సంలో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
బె(ము)క్కంటిని
దర్శిస్తే దీర్ఘవ్యాధులు నయం
భక్తులు కోరిన కోర్కేలను తీర్చడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక వ్యాధులను నయం చేసే వైద్యనాథునిగా బెక్కంటి రామలింగ్వేర స్వామి ప్రసిద్ధికెక్కాడు. స్వా మిని పూజిస్తే వ్యాధులు మటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. బెక్కల్ ఆలయాన్ని రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి మాసంలో ఆలయ పాలక వర్గం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. నేటి నుంచి ప్రారంభమయ్యే రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4న ముగియనున్నాయి.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...