ఎస్సీ రైతులకు చేయూత


Mon,February 18, 2019 11:15 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎస్సీ రైతులకు ఎస్సీ కార్పొరేషన్ చేయూతనందిస్తుందని కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. సోమవారం సిద్దిపేట ఆర్డీవో సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ జిల్లాలోని ములుగు, జగదేవ్‌పూర్ మండలంలో 56 మంది రైతులకు 38.20 ఎకరాల్లో పందిరి కూరగాయల సాగు కోసం రూ. 157.554 లక్షలు (రూ.101.64 లక్షలు కార్పొరేషన్ సబ్సిడీ, రూ. 55.914 లక్షలు బ్యాంకు లోన్) ఆర్థిక సహాయంతో మిరుదొడ్డి మం డలంలో 10 మంది రైతులు 17.30 ఎకరాల్లో పట్టు పరిశ్రమ కోసం రూ.56.67 లక్షలు (రూ.33.94 లక్షలు కార్పొరేషన్ సబ్సీడీ, రూ.22.73 లక్షలు బ్యాంకు లోన్) ఆర్థిక సహాయంతో పట్టు పరిశ్రమ, హార్టికల్చర్ శాఖల సమన్వయంతో సాగు చేయబడుతుందన్నారు. ఈ లబ్ధిదారులకు మార్చి మొదటి వారంలో సాంకేతిక శిక్షణ ఇచ్చి వారి సర్వీసు ఏరియా ప్రకారం బ్యాంకు లోన్ల మంజూరుతో పథకాలు అమలు చేయబడుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, అంధ్రాబ్యాంకు అధికారి లక్ష్మీప్రసాద్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, శాస్త్రవేత్త డా.శ్రీనాథ్ తదితరులు హాజరయ్యారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...