పండుగలా .. జననేత జన్మదినం..


Sun,February 17, 2019 11:20 PM

- రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- సిద్దిపేట, చేర్యాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి
- గజ్వేల్‌లో రక్తదాన శిబిరంలోపాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రధాత... బంగారు తెలంగాణ నిర్మాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలు మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో మెగా ప్లాంటేషన్ చేపట్టారు. ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు. మొదటగా హౌసింగ్ బోర్డు కాలనీ, వేములవాడ కమాన్, నాసర్‌పుర కప్పలకుంట, 8వ వార్డు యాదవసంఘం, నర్సపురం చెరువు కట్ట, బూరుగుపల్లి, ఇర్కోడు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి నీరు పోశారు. వాటి సంరక్షణ కోసం ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడాచైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎర్ర యాదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, సుడా డైరెక్టర్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మొక్క లు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వేల్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా రక్తదానం చేశారు. గజ్వేల్ పట్టణంలో మొక్క లు నాటారు. ఎంపీతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, మడుపు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాస్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అవయవ దానం చేస్తానని ప్రకటించారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొక్కలు నాటారు. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి తనయుడు సతీశ్‌రెడ్డి ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాల య ఆవరణలో టీఆర్‌ఎస్ నాయకులు మొక్కలు నా టారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటి నీరుపోశారు. దవాఖానల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...