ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు


Sun,February 17, 2019 11:13 PM

-మొక్కలు నాటిన టీఆర్‌ఎస్వీ నాయకులు
-మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
చేర్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ యూత్, టీఆర్‌ఎస్వీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డులలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు మంగోలు చంటి, విద్యార్థులు పాల్గొన్నా రు. అలాగే కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆలయ పాలక మ ండలి చైర్మన్ సెవెల్లి సంపత్ ఆధ్వర్యంలో పాలక మండలి స భ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క మిటీ సభ్యులు ఉడుత మల్లేశ్‌యాదవ్, జూకంటి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న ఆధ్వర్యంలో విద్యార్థులు పెన్నులు పం పిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలో రాం పూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ యూత్ మండల ప్రధాన కార్యదర్శి తివారి దినేష్ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.

మద్దూరులో..
మద్దూరు : మండల వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీపీ మంద మాధవి, కొమురవెల్లి ఆ లయ మాజీ చైర్మన్ బద్దిపడిగె కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశంలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మొక్కలను నా టారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసవర్మ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోశ్‌కుమార్, వైస్‌ఎంపీపీ చల్లా లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు కంఠారెడ్డి జ నార్దన్‌రెడ్డి, వంగ బాల్‌రెడ్డి, ముక్క కనకయ్య, చొప్పరి వరల క్ష్మి, బొల్లు కృష్ణవేణి, దుబ్బుడు దీపిక, ఎంపీటీసీ నలుగొప్పుల రేణుక, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కర్ర అ రుణ, యూత్ మండల అధ్యక్షుడు ఇమ్మడి సంజీవరెడ్డి, నాయకులు స్వర్గం లక్ష్మయ్య, దామెర మల్లేశం, బూర్గు రాజు, క్షీరసాగర్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...