అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


Sun,February 17, 2019 11:12 PM

కొమురవెల్లి : మండలంలోని కిష్టంపేటలో రూ.5లక్షల ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు నిర్మాణపనులతో పాటు రసూలాబాద్‌లో రూ. 2లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన 30 ఎల్‌ఈడీ లైట్లను ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌లు బీమనపల్లి కరుణాకర్, పచ్చిమండ్ల స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగునీరుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతంలోని చెరువులు అన్ని నింపిన విషయాన్ని గుర్తు చేశారు. కిష్టంపేట గ్రామ ప్రజలు కోరుకుంటే మీరు కోరుకున్న చోటే చెరువును తవ్వించి గోదావరి జలాలు గ్రామానికి తీసుకువస్తానని, మీ చేతికే అధికారమిస్తునన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా 350 మంది రక్తదానం చేశారని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే పుట్టినరోజుకు రక్తదానాలు చేసిన దాఖలాలు లేవని తనపై అభిమానం చూపిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అదే విధంగా కాశ్మీర్ ఉగ్రదాడుల్లో చనిపోయిన జవాన్‌ల పేరిట మొక్కలు నాటి వాటికి ఆ జవాన్‌ల పేర్లు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, మర్రిముచ్చాల సర్పంచ్ బొడిగం పద్మ, టీఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణాగౌడ్, టీఆర్‌ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు వంగ రాణి, కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్‌అలీ, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు ఏర్పుల మహేశ్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కిష్టయ్య, కిష్టయ్య, సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, కనకయ్య పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు...
కిష్టంపేటకు వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షం లో ఉపసర్పంచ్ మాదిపల్లి ఐలయ్యతో పాటు 40మంది వి విధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ పంజాల నర్సింలు, వార్డు సభ్యులు సాయమ్మ, యశోద ఉన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వ య సమితి గ్రామ కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి, లింగయ్య, మా జీ సర్పంచ్‌లు రాజనర్సు, యాదగిరి, నాయకులు నర్సింలుగౌడ్, పర్శరాములు, శ్రీశైలం, అర్షద్, సుధాకర్ పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...