జననేత జన్మదిన సంబురం


Sun,February 17, 2019 12:09 AM

-హంగు, ఆర్భాటాలు వద్దని ఇప్పటికే పిలుపు
-జిల్లావ్యాప్తంగా జోరుగా మొక్కలు నాటే కార్యక్రమం
-రక్తదాన శిబిరాలు..అన్నదానం..పండ్ల పంపిణీ
-సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో మెగా ప్లాంటేషన్
-సీఎం సీటుపై వరుసగా రెండోసారి సిద్దిపేట ముద్దుబిడ్డ
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నేడు జిల్లా వ్యాప్తంగా మెగా ప్లాంటేషన్, రక్తదాన శిబిరా లు, అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ తదితర కార్యక్రమా లు చేపట్టడానికి టీఆర్‌ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడానికి స్థానిక నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సిద్దిపేటలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో సిద్దిపేటలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి యావత్తు దేశానికి తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారు.

అంతటి మహోన్నత వ్యక్తికి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టడానికి టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. ఎంత ఎదిగిన అంతే ఒదిగే స్వభావం కలిగిన నేత సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ తన చిన్ననాటి స్నేహితులతో పాటు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలను పేరుపెట్టి పిలిచే తత్వం ఆయనలో ఉంది. ఇలా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలుకరించడంతో పాటు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. కొన్నికొన్ని సందర్భాల్లో సమయం చిక్కినప్పుడు మిత్రుల ఇండ్లలో జరిగే వేడుకలకు హాజరవుతూ వారితో ఉల్లాసంగా గడుపుతుంటారు. భోజనం చేసేటప్పుడు తన స్నేహితులతో కలిసి చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఆప్యాయంగా ప్రేమాభిమానాలు పంచుతూ అందరివాడిగా నిలుస్తున్నారు.

అందరి మన్ననలు పొందిన మహోన్నత వ్యక్తి
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తూ అన్నివర్గాల ప్రజల నుంచి మన్ననలు పొందుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఏకంగా 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుచుకుంది. సిద్దిపేట జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌ను గెలిపించాయి. ముఖ్యంగా ఆసరా పింఛన్లు, రైతుబంధు పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, యాదవులకు గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి తదితర పథకాలు ప్రజల మన్ననలను పొందాయి. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నారు. నాడు సిద్దిపేట శాసన సభ్యులుగా ఉన్న సమయంలో కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి పనులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపునివ్వడంతో పాటు, ఆ పనుల స్ఫూర్తితోనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు తాగు నీటి గోస లేకుండా ఏ విధంగైతే చేశారో.. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగు నీరందించే బృహత్తర పథకాన్ని అమలు చేసి పూర్తి చేశారు. సమైక్య రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతం చేశారు. ప్రస్తుతం గొలుసుకట్టు చెరువుల ద్వారా చెరువుల నింపే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదింట ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ప్రతి పల్లెకు రోడ్డు సౌకర్యం, గర్భిణులకు పౌష్ఠికాహారం, తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పలు పథకాలకు విశేష స్పందన రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు ఆసక్తిగా చూడడమే కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారివారి రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై చూపుతున్న చొరవ, కృషికి వివిధ రాష్ర్టాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సిద్దిపేటలో మెగా ప్లాంటేషన్
సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని సిద్దిపేటలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో మెగా ప్లాంటేషన్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుంతలు తీశారు. మొక్కలను తెప్పించి పెట్టారు. పట్టణంలో సిరిసిల్ల కమాన్ నుంచి ఎల్లమ్మ వరకు, అంబేద్కర్‌నగర్ నుంచి నర్సాపురం చౌరస్తా వరకు, నాసరపుర నుంచి ఇస్లామియా కళాశాల చౌరస్తా వరకు, హౌసింగ్ బోర్డు నుంచి ఎన్సాన్‌పల్లి రోడ్ గంగాజల్ వాటర్ ప్లాంట్ వరకు, రాజీవ్ రహదారి పక్కన గల యాదవ సంఘం భవనం ఆవరణలో మొక్కలు నాటనున్నారు.

సీఎం కేసీఆర్ కారణజన్ముడు
మొదటి నుంచి లీడర్ షిప్ వ్యక్తిత్వం కలవాడు. ఎంతో కష్టపడి ప్రజా నాయకుడిగా ఎదిగాడు. తెలంగాణను బంగారు తునకగా చేస్తున్నాడు. కేసీఆర్ నోబెల్‌మ్యాన్. స్పీచ్‌లో దిట్ట. కేసీఆర్‌కు విద్యను బోధించడం నాకు చాలా తృప్తిగా ఉంది. నిజంగా సీఎం కేసీఆర్ కారణజన్ముడే. ప్రజల ఆశీస్సులతో దేశస్థాయిలో గొప్పనాయకుడిగా ఎదిగి, చరిత్ర సృష్టిస్తాడని నమ్మకం నాకు ఉంది. బంగారు తెలంగాణ నిర్మాత అయిన ఆయన, కచ్చితంగా దేశానికి గొప్ప నాయకుడవుతారు. దేశానికి మేలు జరిగి తీరుతుంది.
- గన్నె బాల్‌రెడ్డి, రిటైర్డ్ హెడ్మాస్టర్, కేసీఆర్ చిన్ననాటి గురువు

స్నేహం మరువని మహానేత
స్నేహానికి మరో పేరు సీఎం కేసీఆర్. దేశం లోనే నెంబర్‌వన్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా, చిన్ననాటి మిత్రులంటే ఎంతో ప్రా ణం. స్నేహానికి విలువనిస్తూ అందరితో ఆ ప్యాయంగా మెలిగే గుణం ఆయనకే సొం తం. దుబ్బాకలో 1962 నుంచి 1970 వర కు కలిసి చదువుకున్నాం. ఆయన మిత్రుడిగా ఎంతో గర్వపడుతున్నా. గొప్ప స్థాయికి ఎదిగినా, పుట్టి, పెరిగి చదువుకున్న గడ్డను, తోటి మిత్రులను మరువకుండా ఉన్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆరే.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...