డబుల్ బెడ్ రూం ఇండ్లను వేగవంతం చేయాలి


Sun,February 17, 2019 12:07 AM

సంగారెడ్డిటౌన్ : జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్లను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో సభ్యులు అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, గృహనిర్మాణం, జిల్లా పరిశ్రమల కేంద్రం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రహదారులు, భవనాలు, మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం 1549 దరఖాస్తులు రాగా అందులో 1290 పరిశ్రమల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని డీఐసీ అధికారులు వివరించారు. మిగిలినవి త్వరలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. విద్యాశాఖపై చర్చిస్తూ పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో శిథిల పాఠశాలలను కూల్చి వేసేందుకు అనుమతులు ఇవ్వాలని సభ్యులు ప్రశ్నించగా కలెక్టర్ వద్ద ఫైల్ ఉందని ఆ ఫైల్ రాగానే శిథిల పాఠశాలల కూల్చి వేతకు అనుమతులు ఇస్తామన్నారు.

మిషన్ భగీరథ పథకంపై సమీక్షిస్తూ సింగూరు మంజీరాలో నీరు లేనందున తాగునీటిని ప్రజలకు ఎలా అందిస్తారని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. మంజీరా ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయినందున నర్సాపూర్ సెగ్మెంట్‌కు నీటి సరఫరా ఆగిపోయిందన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలతో తాగునీటిని ప్రజలకు అందిస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. సింగూరు నుంచి ఇంకా నెలరోజులకు సరిపోయే నీరు ఉందని ఆ నీటిని ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అదే విధంగా హెచ్‌ఎండబ్య్లూఎస్‌తో బీరు కంపెనీలకు, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీలకు నీటిని సరఫరా చేస్తున్నారని, ఆ నీటిని ఆపి వేసి ప్రజల తాగునీటికి ఇవ్వాలని సభ్యులు అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖపై చర్చిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ముందున్నామని వివరించారు. కేసీఆర్ కిట్ మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. జిల్లాలో కంటివెలుగు పథకం కొనసాగుతున్నద న్నారు. సమావేశంలో సిద్దిపేట ట్రైనీ కలెక్టర్ అవిశాంత్ పాండ, జడ్పీ సీఈవో టి.రవి, జడ్పీటీసీలు మనోహర్‌గౌడ్, ప్రభాకర్, సునీతా పాటిల్, కొత్తపల్లి శారద, పడాల నాగరాణి, సార యాదమ్మ, పట్లోళ్ల రాంరెడ్డి, అయ్యగల్ల పోచయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...