అమర జవాన్లకు ఘన నివాళి


Sun,February 17, 2019 12:06 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జమ్మూ కశ్మీర్‌లో పుల్వామాలో ఉగ్రదాడిలో మరణించిన అమరుల కుటుంబాలకు కలెక్టరేట్‌లో డీఆర్‌వో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నివాళులర్పించారు. అమర జవాన్ల ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ దేశం కోసం పనిచేస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
స్మృతివనంలో మొక్కలు నాటిన
టీఆర్‌ఎస్‌వీ నాయకులు
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్ల పేర్ల మీద టీఆర్‌ఎస్‌వీ నాయకులు మొక్కలు నాటి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా సమన్వయ కర్త మెరుగు మహేశ్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్మృతివనంలో అమరజవాన్ల పేర్ల మీద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ నాయకులు మహేశ్, బాబు, రెడ్డి యాదగిరి మాట్లాడుతూ ఉగ్రవాదుల బాంబుదాడి పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీరమరణం చెందిన జవాన్ల కుటుంబాలకు అందరం అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, సాయిచరణ్‌రెడ్డి, వెంకటేశ్, రమణ, వంశీ, ప్రశాంత్, స్వామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...