కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్ కీలకం


Sun,February 17, 2019 12:06 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించనుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చేర్యాల పట్టణంలో శనివారం జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కశ్మీర్‌లో సైనికులను ఉగ్రవాదులు హతమార్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నాలుగున్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని, కేంద్రం సైతం తమ పథకాలను కాఫీ కొట్టిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలతో రైతులకు, కార్మికులు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతుల సంక్షేమం కోసం యేటా నియోజకవర్గంలోని చెరువులను గోదావరి జలాలలో నింపుతుండడంతో కరువు చేర్యాల, జనగామ ప్రాంతాల్లో కనిపించకుండా పోయిందన్నారు. చేర్యా ల పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మల్లన్న ఆలయ చైర్మన్ సెవెల్లి సంపత్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...