ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలి


Fri,February 15, 2019 11:31 PM

- ఎంపీపీ మంద మాధవి
- అధికారుల పనితీరుపైమండల సభ ఆగ్రహం
మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ మంద మాధవి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు.

అధికారుల పనితీరుపై సభ్యుల మండిపాటు..
వివిధ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పెట్టుబడి వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారుల తీరుతో రైతులకు చేరడం లేదన్నారు. ఈజీఎస్ ఈసీ బాలలింగం నిర్వాకం వల్ల ఉపాధి పనులు ముందకుసాగడం లేదని ఎంపీటీసీలు సూర్న ఐలయ్య, సుందరగిరి పరుశరాములు సభ దృష్టి తీసుకరాగా ఈసీపై ఎంపీపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మిషన్ భగీరథ పనులు గ్రామాల్లో అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథనీరు సక్రమంగా సరఫరా కావడం లేదని సర్పంచ్‌లు కంఠారెడ్డి జనార్దన్‌రెడ్డి, భీంరెడ్డి మధుసూదన్‌రెడ్డిలు అన్నారు.

గాగిళ్లాపూర్‌కు అదనంగా విద్యుత్ స్తంభాలను మంజూరు చేయాలని గాగిళ్లాపూర్ సర్పంచ్ బొల్లు కృష్ణవేణి కోరారు. నర్సాయపల్లి ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ బద్దిపడిగె లలిత అన్నారు. మర్మాముల పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఎంపీటీసీ సుందరగిరి పరుశరాములు అన్నారు. పీహెచ్‌సీలలో వైద్య సిబ్బంది వంతులవారిగా విధులను నిర్వహించడంపై ఎంపీపీ మాధవి మండిపడ్డారు. ఐకేపీ అధికారులు ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదను ఇవ్వడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమితులైన వి. శ్రీనివాసవర్మతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను మండల సభ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ లక్ష్మీనర్సింహారెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...