అక్రమ నిర్మాణాలు తొలిగించాలి


Fri,February 15, 2019 11:31 PM

-మిషన్ భగీరథ అద్భుత పథకం
-సమస్యలపై గళమెత్తిన నూతన సర్పంచ్‌లు
-మండల సభతో సమస్యల పరిష్కారం ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్
చేర్యాల : పట్టణంలోని కుడి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలు నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే తొలిగించాలని చేర్యాల మండల సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మాణం చేసింది. శుక్రవారం ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ అధ్యక్షతన చేర్యాల(కొమురవెల్లి) మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీలు, నూతన సర్పంచ్‌లు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మండల సభలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. నీటి పారుదల శాఖ చర్చ సందర్భంగా పట్టణంలోని కుడి చెరువు అక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఎఫ్‌టీఎల్(పుల్ ట్యాంక్ లెవల్) హద్దులు ఏర్పాటు చేసినప్పటికి పలువురు అక్రమంగా ని ర్మాణాలు చేశారన్నారు. వెంటనే వాటిని తొలిగించాలని మండల సభ తీర్మానం చేసింది. వైద్యశాఖపై జరిగిన చర్చలో ప ట్టణంలోని సీహెచ్‌సీలో వైద్యులు అం దుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలని, తాగు నీటి కోసం కొత్త ప్లాంట్ ఏ ర్పాటు చేయాలని ఎంపీటీసీలు కొమ్ము న ర్సింగరావు, బొమ్మగాని రవిచందర్ సూ చించారు.

గతంలో పీహెచ్‌సీ ఇన్‌చార్జిలుగా పని చేసిన స్వప్నిక, సుధారాణి, యాకయ్యలు నిధుల ఖర్చులలో అవకతవకలకు పాల్పడ్డారని వారి పై చర్యలు తీసుకోవాలని మండల సభ తీర్మానం చేసింది. మిషన్ భగీరథ పథకం అద్భుతమని దాని ద్వారా ఇంటింటా తాగు నీరు అందించాలని, కొత్త పైపు లైన్లు ఏర్పాటు చేయాలని, నూతన ట్యాంక్‌లు నిర్మించాలని ఆకునూరు, ముస్త్యాల, రాంసాగర్, పోతిరెడ్డిపల్లి,దొమ్మాట, చుంచనకోట,వీరన్నపేట సర్పంచ్‌లు చీపురు రేఖ,పెడుతల ఎల్లారెడ్డి, తాడూరి రవీందర్, కత్తుల కృష్ణవేణి,గాలిపల్లి సుభాషిణిరెడ్డి, ఆది శ్రీనివాస్, కొండపాక భిక్షపతి, ఆకునూరు, చుంచనకోట ఎంపీటీసీలు తాటికొండ వేణుగోపాల్, వడ్లకొండ శ్రీనివాస్ కోరారు. దీంతో ఆర్‌డబ్యుఎస్ డీఈ అనిల్ వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని సభ్యులు హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ సుంకరి సరిత, పీఏసీఎస్ చైర్మన్ బొడిగం మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్ నాగరాజుగౌడ్, ఎంపీడీవో సత్యశ్రీ, ఐబీ డీఈ స్వామిదాసు, ఎంఈవో జి.రాములు, డీఈ అనిల్, ఏఈలు మల్లీశ్వర్‌రావు, దివ్య, లక్ష్మీదేవి,నాగేందర్, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, ఏవోలు అఫ్రోజ్, నరేశ్, ఏపీవో మంజుల తదితరులు పాల్గొన్నారు.

మండల సభలతో సమస్యల పరిష్కారం..
ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ అన్నారు. మండల సభలో ఆయన మాట్లాడుతూ.. మండల సర్వ సభ్య సమావేశంలో చేసిన తీర్మానాలను సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే అమలుపరుచాలని కోరారు.
నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన చేర్యాల, కొమురవెల్లి మండలాలలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్‌లకు ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, ఎంపీడీవో సత్యశ్రీ ఘనంగా సన్మానించారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...