సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి


Fri,February 15, 2019 11:31 PM

రాయపోల్: దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగాయపల్లి తండాలో శుక్రవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ మంగమ్మ రామస్వామిగౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లింగాయపల్లి యాదగిరి, స్టీవెన్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దుబ్బాకలో..
దుబ్బాక, నమస్తే తెలంగాణ: దుబ్బాక మండలం వెంకటగిరితండాలో శుక్రవా రం సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ పాతులోతు పెంటవ్వాకిషన్ ఆధ్వర్యంలో సేవాలాల్ 280వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గిరిజనులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహ న్, గిరిజన నాయకులు శ్రీహరి, కమ్లునాయక్, మంగత్‌యనాయక్, రాంజీ, రాజు, రాములు, నారాయణ, సురేశ్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...