పీఎం కిసాన్ పథకంపై గ్రామ సభలు


Fri,February 15, 2019 11:30 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని రైతులు సద్వినియోగ పర్చుకోవాలని దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరాములు అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పద్మాశ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో పాటు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని రైతులు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మండలంలో చిట్టాపూర్‌తోపాటు తిమ్మాపూర్, ఆరెపల్లి, లచ్చపేట గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించారు. కార్యక్రమంలో చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య, ఏవో ప్రవీణ్, ఏఈవోలు సంతోశ్, హరీశ్, మునీరా, కవిత, రేణుక, రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

రైతుల కోసమే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం
మిరుదొడ్డి : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయరంగంపై ఆధారపడి వేసిన పంటలకు పెట్టుబడులు లేక పలు ఇబ్బందులను అనుభవిస్తున్న రైతులకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని మిరుదొడ్డి వ్యవసాయ అధికారి బోనాల మల్లేశం అన్నారు. శుక్రవారం మండలంలోని మెతె, వీరారెడ్డిపల్లి, లింగుపల్లి, అల్మాజీపూర్, కొండాపూర్, మల్లుపల్లి గ్రామా ల్లో పీఎం సమ్మాన్ పథకంపై గ్రామ సభలు నిర్వహించి 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతుల నుంచి ధ్రువపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పీఎం సమ్మాన్ పథకం కోసం గ్రామాల్లోని రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను నివేదికల ద్వారా ఈనెల 18వ తేదీన ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ఏఈవోలు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...