శిక్షణతో మరింత రాణింపు


Fri,February 15, 2019 11:30 PM

సిద్దిపేట టౌన్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులు శిక్షణ ద్వారా మరింత మెరుగ్గా రాణిస్తారని పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సాయుధ దళాల వార్షిక పునర్వచ్చరణ శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీనికి సీపీ హాజరై మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అంకితభావంతో శిక్షణను పూర్తిచేయాలని, సిబ్బందికి వ్యూహాత్మక నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పుతామన్నారు. దీంతో పోలీసులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు ఉంటుందన్నారు. సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, వ్యూహంగా తలపడడం, ఫస్ట్ ఎయిడ్, నిఘా వేయడం, సాఫ్ట్ స్కిల్స్ వంటి వాటిల్లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పీటీ పరేడ్, మబ్‌ఆపరేషన్, ఆయుధాల శిక్షణ, నాకాబందీ, పోలీసులు చేయదగినవి, చేయకూడవని, విధుల, వీఐపీ, వీవీఐపీ, సెక్యూరిటీ ఇతర అంశాలపై శిక్షణ తరగతులను ఏఆర్ అదనపు డీసీపీ బాబూరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదే విధంగా సీపీ జోయల్ డెవిస్ నంగునూరు, రాజగోపాల్‌పేట పోలీసుస్టేషన్ల పరిధిలో ఫైరింగ్ ప్రాక్టీసు రేంజ్‌లో పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీసును ప్రారంభించారు. అనంతరం పోలీసుల ఫైరింగ్ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు నర్సింహారెడ్డి, బాబూరావు, ట్రైనీ ఐపీఎస్ శబరీశ్, ఆర్‌ఐలు డెవిడ్ విజయ్‌కుమార్, గణేశ్, రామకృష్ణ, టాస్క్‌ఫోర్స్ సీఐ రవీందర్, ఆర్‌ఎస్‌ఐలు ప్రదీప్, శ్రీకాంత్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...