పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


Thu,February 14, 2019 11:32 PM

కొండపాక: అంతరించిపోతున్న అటవీ సం పదను కాపాడుదామని, పర్యావరణ సమతుల్యత పాటిద్దామని జిల్లాలోని సామిల్లులు, సాటి అనుబంధ పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని అదనపు డీసీపీ నర్సింహారెడ్డి కోరారు. కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలోని అర్బన్ పార్కులో జంగల్ బచావో.. జంగల్ బడావో అంశంపై జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ అధ్యక్షతన గురువారం ఉదయం సామిల్లులు, సాటి అనుబంధ పరిశ్రమల యాజమాన్యాలకు అటవీ, పోలీసుశాఖ సం యుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ అటవీ సంరక్షణ, సంపదను కాపాడాలని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని ప్రాధాన్యత సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. సామిల్లులు, అనుబంధ పరిశ్రమల యాజమాన్యులకు, వండ్రంగులకు చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై అటవీ, పోలీసుశాఖ సంయుక్తంగా కలిసి దాడు లు చేసి అవసరమైతే వారిపై పీడీయాక్టు కేసులు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు, ఉన్న వృక్ష సంపదను కాపాడడంలో బాధ్యతాయుతంగా పనిచేద్దామని ఇందుకు మీరు సహకరించాలని కోరారు.

కులవృత్తులకు వ్యతిరేకం కాదు: డీఎఫ్‌వో శ్రీధర్
చట్టం ప్రకారంగా చేసే వ్యాపారాలకు అటవీశాఖ సహకారం ఉంటుందని, చట్ట విరుద్ధంగా ఉండే వ్యాపాలను సహించేది లేదన్నారు. సామిల్లులు, సాటి అనుబంధ పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని, కుల వృత్తులు, సంస్థలకు వ్యతిరేకం కాదని చెప్పారు. పదేండ్లుగా అటవీ సంపదను సంరక్షణ చేయాల్సిన అవసరం ఉందని సర్వే చేశామని, ఆ సర్వే ప్రకారంగా అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రపంచంలో భూమిపై 33శాతం అడవులు ఉండాలని, అలాగే జిల్లాలో 6.4శాతం మాత్రమే అడవులు ఉన్నాయని, మానవాళికి జీవమైన అటవీ సంపదను కాపాడాల్సిన అవశ్యకతను సవివరంగా వివరించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకు సంబంధించి అక్కడి వారందరికీ అర్థమయ్యే రీతిలో పలు ఉదాహరణలు చెప్పా రు. ఈ మేరకు జిల్లాలోని సామిల్లులకు చెందిన యాజమాన్య ప్రతినిధులు, అనుబంధ పరిశ్రమ యాజమాన్యులు, వడ్రంగులు వారికున్న పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ప లు అంశాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తమను ఆదుకోవాలని ఈ సదస్సులో విన్నవించారు. అనంతరం అటవీశాఖ జిల్లా అధికారి శ్రీధర్, డీసీపీ నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో అటవీసంపదను కాపాడుతామని, చట్టాలను అతిక్రమించబోమని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నారాయణ, అటవీ శాఖ అధికారులు రామారావు, అటవీశాఖ సి బ్బంది, జిల్లాలోని సామిల్లులకు చెందిన యాజమాన్య ప్రతినిధులు, అనుబంధ పరిశ్రమల యాజమాన్యులు, వడ్రంగులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...