పగలు వేడి.. రాత్రి చలి


Thu,February 14, 2019 11:32 PM

గజ్వేల్‌రూరల్: వాతావరణ మార్పులతో గజ్వేల్ పట్టణంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం 8గంటల వరకు గజ్వేల్ పట్టణాన్ని మంచుదుప్పటి కప్పేస్తుంది. చలికాలం ముగుస్తుండడంతో వారం రోజులుగా గజ్వేల్ ప్రాంతంలో ఉదయం తీవ్రమైన ఎండ వేడిమి ఉన్నా, రాత్రుళ్లు యధావిధిగా చలిగాలులు వీస్తున్నాయి. ఉదయమంతా ప్రజలు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతూ రాత్రి కూడా చలితో బాధలు పడుతున్నారు. ఉదయం వేడితాపంతో సేద తీరాలని చల్లదనం కోసం వెతుకుతున్న ప్రజలంతా, సాయం త్రం 6గంటలయితే వెచ్చని స్వెట్టర్లను ఆశ్రయిస్తున్నారు. కాగా గజ్వేల్‌లో ఉదయం 8గంటలు దాటుతున్నా మంచు కురుస్తూనే ఉన్నది. దాదాపు ఉదయం 8.30గంటల వరకు కూడా ద్విచక్రవాహనాలపై వెళ్లే ప్రయాణీకులు కురుస్తున్న మంచుతో ఇబ్బంది పడుతున్నారు. పలువురు ఈ చల్లగాలులతో అస్వస్థతకు గురై దవాఖానలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...